మండపేటలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
కోనసీమ: మండపేట పట్టణంలోని కలవ పువ్వు సెంటర్ వద్ద అమ్మవారి ఆలయం సమీపంలో సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. మృతుడికి సుమారు 70 ఏళ్లు ఉంటాయని, చామన చాయ రంగు కలిగి ఉన్నారని టౌన్ సీఐ దారం రమేష్ తెలిపారు. నీలం రంగు గల్ల లుంగీ, టీ షర్టు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.