దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్త జనం

VZM: గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా దాడితల్లి వనం గుడి, బైపాస్ రోడ్డులో ఉన్న దాడితల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి, బొబ్బిలిలో కొంత భాగం, మరో 10గ్రామాల్లో పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఆయా గ్రామాల ప్రజలు, ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తులు మంగళవారం పూజలు చేశారు. భక్తులకు ఎమ్మెల్యే బేబినాయన ప్రసాదం పంపిణీ చేసారు.