యూరియా కోసం రైతుల ధర్నా

SDPT: గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డులో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం ఎదురుచూపులు చూస్తున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న వేళ సమయానికి యూరియా వేయకపోతే పంటల్లో ఎదుగుదల లోపించే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.