VIDEO: బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి: రైతులు
WGL: రాయపర్తి మండలం రామచంద్రుని చెరువు ఆయకట్టు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తూము నుంచి నీటిని వదలడంతో పొలాలన్నీ నీళ్లతో నిండిపోయాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద సాగుచేసిన వరి పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో తూములు బంద్ చేయకపోవడంతో నీరు పొలాల్లోకి చేరుతోందని రైతులు అసహనం వ్యక్తం చేశారు.