'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
JGL: ధర్మారం వ్యవసాయ మార్కెట్లో నందిమేడారం సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం రూ. 1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన కవర్డ్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు.