ఇసుక అక్రమ రవాణాకి వ్యతిరేకంగా నిరసన

ఇసుక అక్రమ రవాణాకి వ్యతిరేకంగా నిరసన

EG: ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరుతూ మల్లయ్య పేట వాసులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరుకున్నాయి. మితిమీరిన లోడ్లతో దుమ్ము, ధూళి రేపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ నాయకుడు సీతారామకృష్ణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సమస్య పై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.