సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన పేరెంట్ టీచర్ స్టూడెంట్ మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కలిసారు. అమరావతికి పయనమైన ముఖ్యమంత్రిని హెలిపాడ్ వద్ద కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.