రింగ్ రోడ్డు అభివృద్ధి పనుల పరిశీలన

రింగ్ రోడ్డు అభివృద్ధి పనుల పరిశీలన

సంగారెడ్డి: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రింగు రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం మట్టి రోడ్డుపై గ్రావెల్స్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి సందర్శించి పరిశీలించారు. చాంద్ ఖాన్ పల్లి నుంచి రాజన్న డాబా వరకు మొరం లెవెలింగ్ పనులు చేస్తున్నారు. ఇందులో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్ ఉన్నారు.