మైలవరంలో ప్రతి బుధవారం ప్రజా వేదిక: ఎమ్మెల్యే

కృష్ణా: ప్రతి బుధవారం మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. మైలవరం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.