ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ASF: వాంకిడి MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆకస్మికంగా సందర్శించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపుపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి, MPDO ఉన్నారు.