కోలాటం వేసి డప్పు వాయించిన ఎమ్మెల్యే సామేలు

కోలాటం వేసి డప్పు వాయించిన ఎమ్మెల్యే సామేలు

SRPT: తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే సామేలు కోలాటం నృత్య కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ సందడి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే సామేలుకు గ్రామస్థులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నర్సయ్య, సైదులు, సోమ్లా నాయక్ పాల్గొన్నారు.