బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
KRNL: మంత్రాలయం మండలం దిబ్బనదొడ్డి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కురువ లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న MLA వై.బాలనాగిరెడ్డి గ్రామానికి చేరుకుని లక్ష్మన్న భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల నగదును అందజేశారు.