యుద్ధం ఎఫెక్ట్.. మూతపడ్డ హోటళ్లు
W.G: ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో ఇవాళ పలు హోటళ్లు మూతపడ్డాయి. ఈ ప్రభావంతో కర్రీ పాయింట్లు కూడా తెరుచుకోలేదని స్థానికలు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.