'మీరే దేశ యువతకు రోల్ మోడల్స్'

'మీరే దేశ యువతకు రోల్ మోడల్స్'

వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళా క్రికెటర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు. మహిళా క్రికెటర్లు ఈరోజు ముర్మును కలవగా, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు. వారంతా దేశంలోని యువ తరానికి, ముఖ్యంగా బాలికలకు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. రాబోయే తరాలకు ప్లేయర్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారని రాష్ట్రపతి ప్రశంసించారు.