ధాన్యం కొనుగోలు ను పరిశీలించిన ధూళిపాళ్ల
గుంటూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉప్పలపాడు ఆర్ఎస్‌కే కేంద్రాన్ని ఆదివారం సందర్శించి, ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి నమూనాలు, బిల్లుల చెల్లింపు వివరాలు తెలుసుకున్నారు. ఎండిన ధాన్యాన్ని పరిశీలించి, తేమ శాతం చెక్ చేశారు. తేమ సరిగ్గా ఉంటే ప్రతి బస్తాకు రూ. 1,700 కంటే ఎక్కువ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు.