బాలికలు విద్యపై శ్రద్ద చూపాలి: ఎంపీడీవో

బాలికలు విద్యపై శ్రద్ద చూపాలి: ఎంపీడీవో

కోనసీమ: ఆలమూరు సచివాలయంలో కిషోర్ వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. బాలికలు విద్యపై శ్రద్ధ చూపాలని ఎంపీడీవో రాజు సూచించారు. వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లావణ్య కుమార్ రాజా పేర్కొన్నారు. జూన్ 4 వరకు ప్రతి శుక్రవారం బాలికల తల్లిదండ్రులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.