VIDEO: భార్యపై భర్త దాడి.. వీడియో వైరల్
KKD: సామర్లకోట మండలం పీ వేమవరంలో భార్య దేవిపై భర్త మణికంఠ విచక్షణ రహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. భార్య దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. మణికంఠతో 2021లో ప్రేమ వివాహం చేసుకుంది. మణికంఠ తన మేనకోడలిని 2వ వివాహం చేసుకుంటానంటే.. భార్య నిరాకరించిందనే నెపంతో విచక్షణా రహితంగా కొట్టాడని దేవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.