హైస్కూల్లో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

హైస్కూల్లో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

W.G: ఉండిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేసే పరిసరాల పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తన నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను పరిశీలిస్తానని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.