'సైబర్ నేరాలపై అవగాహనతో రక్షణ'

కృష్ణా: సాంకేతికత వేగంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, చదువుకున్న, చదువుకోని వారు సైబర్ నేరాల బారిన పడి ధనాన్ని కోల్పోతున్నారని ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సైబర్ నేరాల నుంచి రక్షణకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.