VIDEO: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కార్పొరేటర్

VIDEO: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కార్పొరేటర్

RR: హయత్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్లే మార్గంలో ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తుండడంతో నీటి ప్రవాహాన్ని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.