'విద్యార్థుల హృదయాలను గెలిచారు’
KRNL: డీఈవో శామ్యూల్ పాల్ మరోసారి తనదైన శైలిలో విద్యార్థుల హృదయాలను గెలిచారు. మంగళవారం క్రిష్ణగిరి మండలంలోని పలు విద్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. క్రిష్ణగిరిలోని ఓ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థికి స్వయంగా గోరుముద్దలు తినిపించారు. అనంతరం కేజీబీవీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.