అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం
PPM: రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండవద్దని సూచించారు.