మృతుల ఆభరణాలపై తప్పుడు ప్రచారం - ఖండించిన పోలీసులు

మృతుల ఆభరణాలపై తప్పుడు ప్రచారం - ఖండించిన పోలీసులు

Vsp: సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు పోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశాఖపట్నం పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నగర పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆభరణాలను ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.