'ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి'

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి, నూతన సహకార సంఘాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నూతన సహకార సంఘాల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను జిల్లా అధికారి సంజీవరెడ్డి సమీక్ష సమావేశంలో వివరించారు.