కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై
NDL: బండి ఆత్మకూరు(మం) బీ. కోడూరులో శనివారం ఎస్సై జగన్మోహన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. కొత్త చట్టాలపై, రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ ధరించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు.