తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TPT: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల లగేజీ భద్రపరుచుకునేందుకు కొత్తగా 80 లగేజీ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా అలిపిరి వద్ద 10,194 లగేజీ డిపాజిట్ల సామర్థ్యంతో 7 కౌంటర్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 3,025 లగేజీ డిపాజిట్ల సామర్థ్యంతో 2 కౌంటర్లను అధికారులు సిద్ధం చేశారు. దీనివల్ల కాలినడకన వెళ్లే భక్తులకు లగేజీ సమస్యలు తీరనున్నాయి.