రామసముద్రం అంగన్వాడీలో కేంద్రం బృందం
TPT: వడమాలపేట మండలంలోని రామసముద్రం అంగన్వాడీ కేంద్రాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ సందర్శించారు. పిల్లలతో ముచ్చటించిన ఆయన, వారి చదువు, పోషణ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ డైరెక్టర్ కె.నివాస్, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డీఆర్వో, ఆర్డీవో తదితర అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీల్లో నాణ్యమైన సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.