పాఠశాల వంటగది అపరిశుభ్రతపై ఎంఈవో ఆగ్రహం

ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగది పరిసరాల అపరిశుభ్రతపై ఎంఈవో శ్రీనివాసులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాలతో ఆడుకోవద్దంటూ HM దేమా వెంకటేశ్వర్లుకు హెచ్చరికలు చేశారు. పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్య లోపాలను సరిదిద్దవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయునిదేనని అన్నారు.