నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

NGKL: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సోమవారం తెలకపల్లి మండలంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని నడిగడ్డ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు సురభి బీరప్ప పండుగ ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారు. ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు.