అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
VKB: అంతారం తండాకు చెందిన రాము నాయక్(50) తాండూరు పట్టణం ఎడ్ల బజార్ సమీపంలో మంగళవారం మృతదేహంగా కనిపించాడు. రాము నాయక్ తలపై రక్తగాయాలు కనిపించడంతో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.