ఆదివాసీల హక్కుల సాధనకై పరాడాలి: సంతోష్

ఆదివాసీల హక్కుల సాధనకై పరాడాలి: సంతోష్

ADB: ఆదివాసీల హక్కుల సాధన కోసం అందరు కలిసి పోరాడాలని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. బుధవారం గాదిగూడ మండల కేంద్రంలో ధర్మ యుద్ధ సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీన ఉట్నూరులో జరిగే ఆదివాసీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కనక ప్రభాకర్, మెస్రం దేవరావు, దిగంబర్, జంగు పాల్గొన్నారు.