రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు
అనకాపల్లి మండలం నర్సింగరావుపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎలమంచిలి వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనకనుంచి లారీ ఢీకొంది. దీంతో బస్సు ముందుకు వెళ్లి మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ రాజును విశాఖ KGHకు తీసుకువెళ్లారు.