ఉద్దానం కిడ్నీ మహమ్మారిపై పరిశోధనలు వేగవంతం: MLA
SKLM: ఉద్దానం కిడ్నీ మహమ్మారి పై పరిశోధనలు వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన డా.రవి రాజు కమిటీ శుక్రవారం పలాస ఎమ్మెల్యే శిరీషతో సమావేశమైంది. పరిశోధనల పురోగతిపై కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వివరాలు తెలియజేశారు. ప్రజలు శాస్త్రీయ పరిశోధనలకు శాంపిల్స్ సేకరణ సమయంలో పూర్తిస్థాయిలో సహకరించాలి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.