42 ఏళ్ల పాలిటెక్నిక్ కాలేజ్ పరిస్థితి ఇది..!

మేడ్చల్: రామంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇందిరా బ్లాక్ భవనం ప్రమాదకరంగా మారింది. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన కళాశాలలో అనేక భవనాల పరిస్థితి అధ్వానంగా చేరింది. ప్రభుత్వ యంత్రాంగం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని భవనాల రిపేరు వర్క్స్ చేపట్టాలని కోరుతున్నారు.