ఎమ్మెల్యే దొంతి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ఎమ్మెల్యే దొంతి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఈరోజు సాయంత్రం వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళూలర్పించారు. అనంతరం మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.