పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NRML: మామడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-08 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు 16 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువా, మెమోంటోలతో సన్మానించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సాయంత్రం వరకు సందడిగా గడిపారు.