VIDEO: ఎన్నికల కోడ్.. ఫ్లెక్సీల తొలగింపు
MNCL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ ఫ్లెక్సీల తొలగింపు పనులను ప్రారంభించారు. చెన్నూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పంచాయతీ అధికారుల సమక్షంలో తొలగించారు.