రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అల్లూరి: జీకేవీధి మండలం అసరాడలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొట్నాపల్లికి చెందిన రాంబాబు బైక్‌పై చింతపల్లి వెళుతుండగా, అదే సమయంలో అసరాడ గ్రామానికి చెందిన ఈశ్వరరావు రోడ్డుపై నడిచి వెళుతుండగా బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావును చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.