పోలీసుల సహకారంతో మృతదేహం వాగు దాటింపు

పోలీసుల సహకారంతో మృతదేహం వాగు దాటింపు

ASR: డుంబ్రిగుడ మండలం చంపాపుట్టుకు చెందిన కిల్లో మల్లేష్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబీకులు అతడిని సోమవారం అరకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వారు మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా, మధ్యలో కొండవాగు వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. విషయం తెలిసిన ఎస్సై పాపినాయుడు తమ సిబ్బందితో మృతదేహాన్ని వాగును దాటించారు.