కరాటే విజేతలకు ఘన సత్కారం
SS: దక్షిణ భారత స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో 20 పతకాలు సాధించిన సిరిపి వెంకటేష్ అకాడమీ విద్యార్థులను నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు ఘనంగా సత్కరించారు. ధర్మవరం యువత క్రీడల్లో రాణించడం గర్వకారణమని పేర్కొంటూ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందని పేర్కొన్నారు.