గాజువాక‌లో అదుపుత‌ప్పిన బొగ్గులారీ

గాజువాక‌లో అదుపుత‌ప్పిన బొగ్గులారీ

VSP: గాజువాక‌లోని లంకెలపాలెం జంక్షన్ వద్ద శ‌నివారం తెల్ల‌వారుజామున‌ బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. గాజువాక నుంచి పరవాడ వైపు వెళుతున్న‌ ఈ భారీ లారీ, ఒక్కసారిగా టర్నింగ్‌లో అదుపుతప్పి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి వైపు ఒరిగి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.