'కీర్తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

'కీర్తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

KDP: ఖాజీపేటలోని అగ్రహారంకు చెందిన విద్యార్థిని కీర్తన, ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మంగళవారం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కీర్తన కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. స్థానిక అగ్రహారం నుంచి చేపట్టిన ర్యాలీ బంగ్లా కూడలి వరకు కొనసాగింది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలు ప్రజా సంఘాలు కోరాయి.