VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పదవ పరీక్షలు..
ADB: ఆదిలాబాద్ పట్టణంలో పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకుంటున్నారు. విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పరీక్ష నిర్వాహకులు వెల్లడించారు.