'శివన్నగూడెం రిజర్వాయర్‌ను వెంటనే పూర్తి చేయాలి'
NLG: శివన్నగూడెం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని ఐదు మండలాలు సస్యశ్యామలమవుతాయన్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు.