ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: సీపీ
NZB: అత్యవసర కాల్స్ నిర్వహణలో మరింత మెరుగుదల కోసం సీపీ సాయి చైతన్య పోలీస్ సిబ్బందికి కీలక సూచనలు చేశారు. బాధితులతో మర్యాదగా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని, వేగంగా స్పందించి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. డయల్ 100, 112 సేవల పనితీరు, సాంకేతిక అంశాలపై హైదరాబాద్ నిపుణుల బృందం పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యమని CP తెలిపారు.