కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

PDPL: కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా మే 15 నుంచి 26 వరకు మంథని డిపో రోజుకు 10 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంథని బస్టాండ్ నుంచి కాళేశ్వరానికి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ. 70గా టికెట్ ధరలు నిర్ణయించామన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు.