బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి వేధింపులలో బాధితులైన మహిళలు, అమ్మాయిల తప్పు లేదని స్పష్టం చేశారు. బాధితులను నిందించే వైఖరిని తప్పుబట్టారు. లోరియల్ పారిస్ స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాలుగా గ్లోబల్‌ బ్యూటీ బ్రాండ్‌ లోరియల్ పారిస్‌కు ఐష్ అంబాసిడర్‌గా ఉన్నారు.