ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్
వనపర్తి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు స్వయంగా ముందస్తు పెట్టుబడి పెట్టలేని పరిస్థితులు ఉన్నవారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. గతంలో మంజూరైన వివిధ దశలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు.