నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ
NLG: రెహమాన్ బాగ్ యువకులు మౌలానా యాసిర్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు, వృద్ధులకు 100కు పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్‌టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలను విడిచి మంచిపనుల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తనలో భాగంగా సమాజానికి సేవ చేయడం యువతకు ఆదర్శమన్నారు.