నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KDP : పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి కొత్తపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రూరల్ ఏఈ కె. రమేష్ తెలిపారు. ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో మారమ్మతుల కారణంగా ఉదయం 9.00 నుంచి 12.00 వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.